Breaking News

స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం..

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న ఉద్యమ పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. వ‌డ్డే ఓబ‌న్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు ఓబన్న చేసిన త్యాగం, దేశభక్తి, ధైర్యం జన హృదయాలలో నిలిచిందన్నారు. ఓబన్న ముఖ్యంగా రైతుల హక్కులను రక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాడటానికి విశేష కృషి చేశారన్నారు. ఓబన్న త్యాగం చిరస్మరనీయమని.. ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు. క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, అధికారులు, వ‌డ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధుల‌తో క‌లిసి ఓబ‌న్న చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఓబ‌న్న త్యాగాన్ని స్మ‌రించుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *