అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ విశిష్ట కనుమ పండగ శుభాకాంక్షలు. పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశు పక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది. ‘‘అన్నదాతా సుఖీభవ’’ అంటూ ఆశీర్వదిస్తుంది. కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Read More »Daily Archives: January 15, 2026
స్వర్ణ నారావారి పల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరి కి ప్రణాళిక
-స్వర్ణకుప్పం, నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యం -స్వర్ణ చంద్రగిరి మండల అభివృద్ధి ప్రణాళికల్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. గత ఏడాది …
Read More »సీఎం చంద్రబాబు కుటుంబంతో కలిసి గ్రామ దేవతలకు పూజలు
నారావారిపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. పండితులు వేద ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జుర నాయుడు, అమ్మణ్ణమ్మ, తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఇంటి …
Read More »జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా, గురువారం బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ ను సందర్శించడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM)- 2026 కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆటో రిక్షా వాహనదారులకు అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడం నిషేధం అనీ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది, దీనితో పాటుగా ఆటో రిక్షా వాహనదారులకు సంభందిత వాహన పత్రాలు (పర్మిట్ / ఫిట్నెస్ లైసెన్సు / ఇన్షూరెన్స్ ) తప్పనిసరిగా …
Read More »భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తు చేసే రోజు జనవరి 15
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో జనవరి 15కు ఒక ప్రత్యేకత ఉంది. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది. దేశం కోసం సైనికులు చేస్తోన్న త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను (Indian Army Day) నిర్వహిస్తారని ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు అన్నారు. దేశ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు …
Read More »సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ని కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్
నారావారి పల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారి పల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ని మరియు వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ ముఖ్యమంత్రి కి, మంత్రి కి మరియు వారి కుటుంబ సభ్యులకు …
Read More »దొండపాటి కుటుంబానికి సుజనా చౌదరి భరోసా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మందడం లోని దొండపాటి రామారావు కుటుంబ సభ్యులకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఓదార్చారు. గురువారం సుజనా చౌదరి మందడం గ్రామ సభలో ఇటీవల గుండెపోటు తో మృతి చెందిన రైతు దొండపాటి రామారావు నివాసానికి వెళ్లారు. రామారావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని సుజనా భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని కుటుంబ సభ్యులు సుజనా కు వివరించారు. వారికి ఈ విధమైన …
Read More »రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుంది…
-మందడం గ్రామంలో రైతుల భేటీలో సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రైతులకు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం మందడంలో స్థానిక నాయకుడు మాదల రాజేంద్ర నివాసంలో సుజనా చౌదరితో రైతులు భేటీ అయ్యారు… ఈ సందర్భంగా రాజధాని గ్రామాలకు చెందిన పలువురు సుజనా ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు . పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతుల సమస్యలను తీర్చడంలో అధికారులు అలసత్వం …
Read More »ఉత్సాహంగా సాంస్కృతిక ప్రదర్శనలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై గురువారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కొనసాగాయి. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం ,ఆర్ట్స్ ,నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆర్ లక్ష్మీ శ్రీనివాస్ భక్తి , సినీ గీతాలు వీణ కచేరి వీనుల విందుగా కొనసాగింది. ఒడిస్సా కళాకారుల థింసా గిరిజన జానపద నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో కచేరి తో హోరెత్తించారు. పల్నాడు జిల్లా కళాకారుల రామాయణంలోని మైరావణుడి ఘాట్టం తోలుబొమ్మలాట అధ్బుతంగా, ప్రదర్శించారు.పాడుత తీయగా ఫేం గాయనీ గాయకుడు డా.వీరా . వై హేమమాలిని …
Read More »సరస్ మేళా కు కొనసాగుతున్న ప్రజల రద్దీ
-డ్రై ఫ్రూట్ వ్యాపారం, డీపీఆర్ ల తయారీ పై శిక్షణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్లపాడు రోడ్డులో రెడ్డి కళాశాల సమీపంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ కు గురువారం ప్రజల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచే ప్రజలు ప్రజలు పెద్ద ఎత్తున మేళాలు సందర్శించి, వస్తువులను కొనుగోలు చేశారు. సాయంత్రం ప్రజల సంఖ్య మరింతగా పెరిగింది. దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన …
Read More »
Prajavartha Online Telugu News