గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై గురువారం సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కొనసాగాయి. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం ,ఆర్ట్స్ ,నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆర్ లక్ష్మీ శ్రీనివాస్ భక్తి , సినీ గీతాలు వీణ కచేరి వీనుల విందుగా కొనసాగింది. ఒడిస్సా కళాకారుల థింసా గిరిజన జానపద నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో కచేరి తో హోరెత్తించారు. పల్నాడు జిల్లా కళాకారుల రామాయణంలోని మైరావణుడి ఘాట్టం తోలుబొమ్మలాట అధ్బుతంగా, ప్రదర్శించారు.పాడుత తీయగా ఫేం గాయనీ గాయకుడు డా.వీరా . వై హేమమాలిని సినిగీతాలు ఆలపించారు, కృష్ణ కుమారి, కల్యాణ్ సినీ గీతాలకు డాన్స్, జానీ గీతాలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు వీక్షించారు.
సరస్ మేళా లో శుక్రవారం ప్రదర్శనలు
సరస్ మేళా లోని కళావేదికపై శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి గుజరాత్ రాష్ట్ర కళాకారులు గూమర్ సాంప్రదాయ నృత్యాలు, గుంటూరు జిల్లా కళాకారులు గూటాల కోలాటం , కూచిపూడి, జానపద నృత్యాలు, స్కిట్లు ప్రదర్శిస్తారు.
Prajavartha Online Telugu News