Breaking News

Daily Archives: January 25, 2026

జిఎంసి అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30న ప్రభుత్వ వైద్యశాలలో నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం ఉన్నందున, సదరు పర్యటన మార్గంలో రోడ్లపై గోతులు ఉండకుండా ప్యాచ్ వర్క్స్, డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపులో జిఎంసి అధికారులు సమన్వయంతో 2 రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ఆదివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి నగరంపాలెం వైపుగా జిజీహెచ్ వరకు విభాగాధిపతులతో కలిసి పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఈ రోజు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇరువురు అమ్మవారి దర్శనాల నిర్వహణ, భక్తులకు ప్రసాదాల పంపిణీ విధానం, అలాగే నిర్వహించబడనున్న రంగుల మహోత్సవ ఏర్పాట్లపై కమిటీ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. …

Read More »

నగరంలో తొలిసారి జిల్లా స్థాయి గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఐ.జి.ఎం. స్టేడియం….

-రాష్ట్రస్థాయి వేడుకలు అమరావతిలో ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం… -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా తొలి గణతంత్ర వేడుకలు…. -ఐ.జి.ఎం. స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం… విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గణతంత్ర దినోత్సవము స్వాతంత్ర దినోత్సవము రాష్ట్ర స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రధాన కేంద్రంలోను జిల్లా స్థాయి వేడుకలను జిల్లా ప్రధాన స్థానంలో నిర్వహించేవారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేడుకలను హైదారాబాద్లోను జిల్లా స్థాయి వేడుకలను కృష్ణాజిల్లా ప్రధాన …

Read More »

ఈ నెల 26న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం (పీజీఆర్ఎస్) రద్దు…

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, జిల్లాలో నిర్వహించే గణతంత్ర వేడుకలలో పాల్గొనవలసి ఉన్నదని మరియు ప్రభుత్వ సెలవు కారణంగా ఈనెల 26న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరేట్ డా. జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లా స్థాయి తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్, …

Read More »

ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటు హక్కు వినియోగమే బలమైన పునాది

– ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ తెలిపారు. స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రం లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర …

Read More »

మాజీ మంత్రి జోగి రమేష్ ని కలిసిన నాయకులు పోతిన వెంకట మహేష్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ లిక్కర్ తప్పుడు కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఆదివారం ఇబ్రహీంపట్నంలోని వారి స్వగృహంలో వైఎస్సార్సీపీ  గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ కలిశారు.

Read More »

నగరాల కులస్థుల వధూవరుల సమాచార సంచిక కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాల కులస్థుల వధూవరుల సమాచార సంచిక కార్యక్రమాన్ని శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నగరాల సంఘం విజయవాడ అర్బన్ నగరాల సంఘం ఆంధ్ర ప్రదేశ్ నగరాల యువజన సంఘం మరియు ఇరిపిల్ల సత్యనారాయణ ప్రసాద్ మ్యాట్రిమోనియల్ వార్ల సంయుక్త నిర్వహణలో చిట్టినగర్ లో శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన పోతిన సత్యవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ  గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్, మేయర్ …

Read More »

విచ్ఛలవిడిగా మెడికల్ మాఫియా

-ఫార్మసిస్టుల ఉపాధికి గండి -అనర్హులతో ఔషధాల విక్రయం -డ్రగ్స్ ట్రేడ్ మాఫియా వెనుక అవినీతి దందా -ఫార్మసీ కౌన్సిల్ ఒత్తాసు పలికిన అధికారులపై చర్యలేవి ? -30న నిరుద్యోగ రణభేరికి భారీగా తరలిరావాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రౌలో మెడికల్ మాఫియా విచ్ఛలవిడిగా పెరిగిపోతోందని, ఇందుకు నిదర్శనంగా ఫార్మసీ నిరుద్యోగ వృత్తి నిపుణుల సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని వారి పేరుపై లైసెన్సులు పొంది ఔషధ దుకాణాల కార్యకలాపాలను నిర్వహించడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల …

Read More »

స్త్రీ – శక్తి పధకాన్ని విజయవంతం చేస్తున్న ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి…

-ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హోమ్ శాఖ మంత్రికి, డిజిపికి లేఖ రాసిన ఆర్టీసి ఇ.యు నాయకులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీ-శక్తి పధకం అమలు పరచడంలో కండక్టర్లు డ్రైవర్లకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నా స్త్రీ-శక్తి పధకాన్ని విజయవంతం చేస్తువున్నా రోజు రోజుకు కొంత మంది దురుసు స్వభావం కలిగిన ప్రయాణీకులు ఆన్ డ్యూటీ సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోయినవి. భౌతిక …

Read More »

భారత దేశ‌ ప్రజాస్వామ్యానికి మార్గదర్శి, దేశ ప్రగతికి పునాది రాజ్యాంగమే

-ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిన ఆదర్శ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగమంటూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.. భారత రాజ్యాంగం ప్రజలకు సమానత్వం, వాక్ స్వాతంత్య్రం, సభా స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశక …

Read More »