జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఈ రోజు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇరువురు అమ్మవారి దర్శనాల నిర్వహణ, భక్తులకు ప్రసాదాల పంపిణీ విధానం, అలాగే నిర్వహించబడనున్న రంగుల మహోత్సవ ఏర్పాట్లపై కమిటీ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా అమ్మవారి తిరుగు ప్రయాణ సమయంలో భారీగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల సిద్ధత వంటి అంశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు పలు మార్గదర్శకాలు ఇచ్చారు. అనంతరం ఇరువురు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ కార్యక్రమంలో అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ తెలుగుదేశం పార్టీ అంగన్వాడి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, సూర్యదేవర రాంప్రసాద్, కాకులపాటి కృష్ణమోహన్, జనసేన నాయకులు ఆకుల బాబ్జి, బీజేపీ యువ నాయకుడు నోముల రఘు కళ్యాణం మురళి పెద్ద శివాలయం చైర్మన్ మహంకాళి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News