గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం అయింది. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర …
Read More »Monthly Archives: January 2026
గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి వేడుకలు గుంటూరులో పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఉదయం 11.30 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతుందని తెలిపారు. జెండా వందనం, జిల్లా కలెక్టర్ ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల బహుకరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో …
Read More »డి.ఆర్.ఓ ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉత్తమ ఎలక్టోరల్ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ ఏడాది “నా భారత్ – నా ఓటు” (My India, My Vote) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేయడంతో జిల్లా …
Read More »ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటుతో ప్రతీ ఒక్కరికీ సమానత్వం లభించిందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఓటరు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు. కుల, మత బేధాలు లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం ద్వారా సమాన అవకాశాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. …
Read More »గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం జిఎంసి PGRS రద్దు
-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26వ తేది సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల వలన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దు చేయడమైనదని, నగర ప్రజలు గమనించి, ఏమైనా స్థానిక సమస్యలు ఉంటే జిఎంసి కాల్ సెంటర్ 0863 2345103 కి కాల్ చేయవచ్చని తెలిపారు .
Read More »జిఎంసి అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30న ప్రభుత్వ వైద్యశాలలో నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం ఉన్నందున, సదరు పర్యటన మార్గంలో రోడ్లపై గోతులు ఉండకుండా ప్యాచ్ వర్క్స్, డ్రైన్ల శుభ్రం, ఆక్రమణల తొలగింపులో జిఎంసి అధికారులు సమన్వయంతో 2 రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ఆదివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి నగరంపాలెం వైపుగా జిజీహెచ్ వరకు విభాగాధిపతులతో కలిసి పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఈ రోజు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఇరువురు అమ్మవారి దర్శనాల నిర్వహణ, భక్తులకు ప్రసాదాల పంపిణీ విధానం, అలాగే నిర్వహించబడనున్న రంగుల మహోత్సవ ఏర్పాట్లపై కమిటీ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. …
Read More »నగరంలో తొలిసారి జిల్లా స్థాయి గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఐ.జి.ఎం. స్టేడియం….
-రాష్ట్రస్థాయి వేడుకలు అమరావతిలో ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం… -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా తొలి గణతంత్ర వేడుకలు…. -ఐ.జి.ఎం. స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గణతంత్ర దినోత్సవము స్వాతంత్ర దినోత్సవము రాష్ట్ర స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రధాన కేంద్రంలోను జిల్లా స్థాయి వేడుకలను జిల్లా ప్రధాన స్థానంలో నిర్వహించేవారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేడుకలను హైదారాబాద్లోను జిల్లా స్థాయి వేడుకలను కృష్ణాజిల్లా ప్రధాన …
Read More »ఈ నెల 26న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం (పీజీఆర్ఎస్) రద్దు…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, జిల్లాలో నిర్వహించే గణతంత్ర వేడుకలలో పాల్గొనవలసి ఉన్నదని మరియు ప్రభుత్వ సెలవు కారణంగా ఈనెల 26న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరేట్ డా. జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లా స్థాయి తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్, …
Read More »ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటు హక్కు వినియోగమే బలమైన పునాది
– ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి బాధ్యత – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ తెలిపారు. స్థానిక తుమ్మల పల్లి కళాక్షేత్రం లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News