Breaking News

Monthly Archives: January 2026

కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వివరాలు 1) డేటా ఎంట్రీ ఆపరేటర్ అర్హతలు: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికెట్ మరియు మూడు సంవత్సరాల అనుభవం వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్. 2)ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అర్హతలు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్. ఇతర వివరాలకు మరియు సంబంధిత నోటిఫికేషన్, అప్లికేషన్ …

Read More »

జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అభివృధి, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : NTR జిల్లా ప్రకృతి వ్యవసాయ, జిల్లా ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ విధానంపై NMNF క్లస్టర్లలో ఫేజ్ 2 ట్రైనింగ్ -ICRP ల కు గుర్తింపు శిక్షణ కార్యక్రమమును 5 రోజులపాటు నిర్వహిస్తున్నారు . డిపిఎం వై శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానమును రైతులకు తక్కువ పెట్టుబడితో స్థిరమైన మరియు నిరంతర ఆదాయం కల్పించడమే లక్ష్యమన్నారు. ఎంపిక చేసిన ట్రైనింగ్ -ICRP కు ప్రకృతి వ్యవసాయం లో జరిగే 9 …

Read More »

యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయంలో యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరియాను శాస్త్రీయ నిష్పత్తి (4:2:1) కి బదులుగా రైతులు విపరీతంగా (7:2.8:1) వాడుతున్నారన్నారన్నారు. దీనివల్ల నేల నిస్సారం కావడం, తెగుళ్లు పెరగడం, పెట్టుబడి ఖర్చు పెరగడం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడతాయన్నారు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సూచించిన కొన్ని ఆధునిక …

Read More »

సరైన అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం

– ఆశ‌, భ‌యం.. సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌కు చిక్కేలా చేస్తాయి – అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి – సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ సీఐ ఎన్‌.శ్రీనివాస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌రైన అవ‌గాహ‌న ద్వారానే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు క‌ళ్లెం వేయొచ్చ‌ని విజ‌య‌వాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్‌. శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌజ్ ప్రాంగ‌ణంలోని జిల్లా స‌మాచార, పౌర …

Read More »

జనవరి 23, 24, 25 తేదీలలో “శుభే ఆంధ్రాకే ఖురానోకా దీనీ ఇజ్తెమా”

-ఇస్తేమా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..! వైయస్ ఆర్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 23, 24, 25 తేదీలలో జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి “శుభే ఆంధ్రాకే ఖురానోకా దీనీ ఇజ్తెమా” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్ల ను చేస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి  ఎస్.సవిత పేర్కొన్నారు మంగళవారం వైయస్ ఆర్ కడప జిల్లా… సికె దిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడ లో జనవరి 23, 24, 25 …

Read More »

రూ.26 కోట్లతో తెనాలిలో 50 పడకల నూతన ఆయుష్ హాస్పిటల్

-మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రానికి ఐదు ఆయుష్ హాస్పిటల్స్ మంజూరు చేయగా, అందులో భాగంగా తెనాలికి రూ.26 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా తెనాలిలోని కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,“ఆయుర్వేదంతో ఆరోగ్యం సాధ్యమవుతుంది. మారుతున్న …

Read More »

విద్యార్థుల వసతి గృహాల తనిఖీల కోసం జాయింట్‌ యాక్షన్ కమిటీలు

-9 ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటుకు ఆదేశాలు -జిల్లా కలెక్టర్లకు పంపిన‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ -తనిఖీల్లో గమనించాల్సిన అంశాల గురించి కూడా స్పష్టీకరణ* -క్యాలెండర్ ప్రకారం క్ర‌మం త‌ప్ప‌కుండా, ఆకస్మిక తనిఖీలు జరపాలని వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విద్యా సంస్థలు, సంక్షేమ శాఖల వసతి గృహాల్లో విద్యార్థులు ఆనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సత్వరం తీసుకోవాల్సిన చర్యల కోసం తనిఖీల నిమిత్తం 9 ప్రభుత్వ శాఖల అధికారులతో జాయింట్‌ యాక్షన్ …

Read More »

వ్యవసాయ సీజన్ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి

-లో ఓల్టేజ్ కు చెక్ పెట్టేందుకు రూ. 800 కోట్లతో 250 సబ్ స్టేషన్లు -రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6 వేల కోట్లతో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్మాణం -గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల భారం విద్యుత్ శాఖ పై వేసింది -కూటమి ప్రభుత్వం ట్రూ డన్ ద్వారా 13 పైసలు తగ్గించింది -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా …

Read More »

భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

-వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి -భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం -వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి దేవాలయాలను మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మాజి మంత్రి …

Read More »

పశ్చిమలో వైకాపా సంస్థాగత నిర్మాణా సన్నాహక సమావేశం

-పాల్గొన్న వెలంపల్లి, దేవినేని, వరికూటి, కందుల -పార్టీ సంస్థగత నిర్మాణాని వేగవంతం చేయండి – వెలంపల్లి -పార్టీని పటిష్టంగా నిర్మించి వెలంపల్లి ని మల్లి మంత్రిని చేయండి – దేవినేని -పశ్చిమ పార్టీ నాయకులు కార్యకర్తల కృషితోనే పశ్చిమలో వైకాపా గెలుపు సాధిస్తుంది – వరికూటి అశోక్ బాబు -పార్టీ సంస్థాగత నిర్మాణానికి అందరు సమిష్టిగా కృషి చేయాలి – కందుల రవీంద్ర రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి మంగళవారం నాడు స్థానిక …

Read More »