Breaking News

Monthly Archives: January 2026

డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం డ్రైవర్లకు రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమం, నేత్ర పరీక్షలు శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని, రోడ్డు కండిషన్ మరియు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని పరిమిత స్పీడ్ తో వాహనాలను …

Read More »

పొన్నూరు నియోజకవర్గంలో మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చే శంకుస్థాపన కార్యక్రమాలు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పొన్నూరు నియోజకవర్గంలోని నారాకోడూరులో ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూమ్ 32 లక్షల నిధులతో నారాకోడూరు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గానూ స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ… * నిరంతరం నారా, నందమూరి కుటుంబానికి అండగా …

Read More »

సరస్ లో సాంస్కృతిక కార్యక్రమాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ లో ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్ ను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి మంగళ వారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. సరస్ (SARAS – Sale of …

Read More »

సంక్షేమ వసతి గృహాల “స్వీకారం”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోను, గురుకులంలోను మౌళిక వసతుల కల్పనకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా “స్వీకారం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ వసతి గృహం ‘ సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా ‘ ఉండాలనే తలంపుతో దీనిని చేపట్టడం జరిగింది. విద్యాభివృద్ధికి ‘మన బడి మన బాధ్యత’ అనే కార్యక్రమం ఇప్పటికే చేపట్టిన సంగతి తెలిసిందే. పి 4 (P4) కార్యక్రమం కింద స్వీకారం (Sweekaram) …

Read More »

అక్షయపాత్ర, జియంసి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్ల వద్ద ఆహ్లాదకరమైన, పరిశుభ్ర వాతావరణం అందించేందుకు అక్షయపాత్ర, జియంసి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల పరిసరాలు పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అక్షయపాత్ర, జిఎంసి సిబ్బంది …

Read More »

డ్రోన్ల ద్వారా కీమోఫాస్ లిక్విడ్ ని స్ప్రే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చెరువులు, ఖాళీ స్థలాల్లో దోమలు పెరగకుండా ప్రత్యేకమైన డ్రోన్ల ద్వారా కీమోఫాస్ లిక్విడ్ ని స్ప్రే చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం నల్లచెరువులో యాంటీ లార్వా యాక్టివిటిలో భాగంగా డ్రోన్ ద్వారా చేస్తున్న స్ప్రేయింగ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ ల వారీగా ఉన్న చెరువులు, పెద్ద ఖాళీ స్థలాల్లో యాంటీ లార్వా యాక్టివిటిని మ్యాన్యువల్ గా చేయడానికి వీలు లేని ప్రాంతాల్లో డ్రోన్ల …

Read More »

మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

బొండపల్లి, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన బొండపల్లిలోని లక్ష్మీనారాయణ మోడరన్ రైస్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యాన్ని మర పట్టి ప్రభుత్వానికి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. సీఎంఆర్ విషయంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు. ఇప్పటికి కేవలం 17 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం …

Read More »

ప్ర‌తీ అడుగు రైతు సంతోషం కోస‌మే

-51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం -రైతులకు 24 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు -పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ బొండపల్లి, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతుకు ఎటువంటి కష్టం రాకుండా వెన్నంటే ఉండి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్ర‌తి అడుగు రైతు సంతోషం కోసం, …

Read More »

దోమలను నియత్రించాలి!

-ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -ఓపెన్ డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి! -నీటి లో క్లోరినేషన్ తీరును పరిశీలించాలి -స్క్రబ్ టైఫస్ జ్వరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి -కుక్కకాట్ల వల్ల జరిగిన మరణాలకు దారితీసిన కారణాలపై ఆడిట్ జరగాలి -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ -వసతి గృహల్లో జాయింట్ inspections cheyali.. Ranga Reddy -Turkhapalem lo fever clinics nirvahinchali Mukhopadya -రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ప్రచార పిచ్చితోనే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో

-పబ్లిసిటీ కోసం రూ. 22 కోట్ల ప్రజాధనం వృధా -రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాస్ …

Read More »