Daily Archives: February 14, 2026

రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్ర భూమి మన రాష్ట్రం. భక్త సులభుడైన శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఈ పర్వదినాన శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

Read More »

నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా ఎస్టీ విద్యార్థులకు శిక్షణ

-ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.9 వేలకోట్లు కేటాయింపు -సేవాలాల్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి -సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుల్లో ముందుంటున్నారని, ఉన్నత కొలువులు సాధించాలనే పట్టుదల వారిలో పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో …

Read More »

ఏపీని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే దిశగా అడుగులు

-విశాఖ వేదికగా దిగ్విజయంగా ఏడీటీవోఐ నేషనల్ ట్రావెల్ మార్ట్ – 2026 ముగింపు -7 యాంకర్ హబ్‌లు, వెడ్డింగ్ టూరిజం, మైస్ పాలసీపై కీలక చర్చలు ఆంధ్రప్రదేశ్ టూరిజం విజన్-2047 లక్ష్యంగా రోడ్‌మ్యాప్ ఆవిష్కరణ -వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు “వెడ్ ఇన్ ఆంధ్ర” క్యాంపెయిన్ -నేషనల్ ట్రావెల్ మార్ట్ విజయవంతంగా ముగియడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ (ఏడీటీవోఐ) సంయుక్తంగా …

Read More »

ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు

-అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలోని శాసనసభను వివిధ పాఠశాలల విద్యార్థులు సందర్శించి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చట్ట సభలు ఎలా పనిచేస్తాయి? ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి? వంటి అంశాలపై విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం పొందారు. ఇప్పటివరకు 22 పాఠశాలల నుండి మొత్తం 798 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సభా వ్యవహారాలను పరిశీలించిన విద్యార్థులు ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంపొందించుకున్నారు. విరామ సమయంలో మంత్రులు వంగలపూడి అనిత, సవిత, …

Read More »

ఎస్సీల సంక్షేమానికి రూ. 20,644 కోట్ల కేటాయింపు ఎస్సీల అభ్యున్నతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్దికి నిదర్శనం

-బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమం, అభివృద్దికి పెద్ద పీట వేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమానికి రూ. 20,644 కోట్ల కేటాయింపు ఎస్సీల అభ్యున్నతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకున్న చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ అన్నారు. శనివారం నాడు విడుదల చేసిన పత్రిక మంత్రి మాట్లాడుతూ….బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమం, అభివృద్దికి పెద్ద …

Read More »

రైతన్నా మీకోసం పంచసూత్రాలతో వ్యవసాయానికి ఊపిరి

– రైతును “రాజు” గా నిలబెట్టే దిశగా 2026–27 వ్యవసాయ, అనుబంధ శాఖ‌ల‌ బడ్జెట్ – స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంతో అగ్రిటెక్, నీటి భద్రతపై ఫోకస్ – వ్యవసాయం లాభసాటి అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది – యువతను వ్యవసాయం వైపు తిప్పేలా లాభదాయక వృత్తిగా మార్పు – డిమాండ్ ఆధారిత పంటల వైపు ప్రోత్సాహం – పోలవరం నుంచి వెలిగొండ వరకు ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం – ఖరీఫ్ ముందస్తు సాగు, తుఫానుల ప్రభావం తగ్గింపు లక్ష్యం – రూ.53,752.12 కోట్లతో బడ్జెట్ …

Read More »

బీసీలకే సింహాభాగం

-బడ్జెట్ కేటాయింపుల్లో మంత్రి సవిత -సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తంచేశారు. మూడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు …

Read More »

ఐక్యవేదిక సభ్య సంఘాల సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యవేదిక సభ్య సంఘాల సమావేశం శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయం, విధ్యాధరపురం, విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో గతంలో ప్రభుత్వానికి ప్రాతివిధ్యం చేసిన సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా ఐక్యవేదిక చైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ  సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ 12వ పి.ఆర్.సి. గడువు పూర్తి అయ్యి 30 నెలలు దాటినా ఇంకా కమీషన్ ను వేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. …

Read More »

రాష్ట్ర బడ్జెట్ ఆచరణాత్మకం, సంక్షేమదాయకం మరియు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ఉంది : ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణాత్మకంగా, సంక్షేమమే ధ్యేయంగా మరియు దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథంతో ఉందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) హర్షం వ్యక్తం చేసింది. 2026 రాష్ట్ర బడ్జెట్‌పై ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు: “ముఖ్యమంత్రి ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రాధాన్యతలు ఉన్నాయి. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు సవాళ్లను అధిగమిస్తూనే, అటు సంక్షేమాన్ని, ఇటు …

Read More »

విధ్వంసం నుంచి వికాసం వైపు దారి చూపే బడ్జెట్

-రాష్ట్రాభివృద్ధికి క్రమశిక్షణ, ఐక్యత, సాహసోపేత నిర్ణయాలు అవసరం -అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్ – గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధుల కేటాయింపు -మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు -⁠గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని గాడిలో పెట్టే ప్రణాళిక -రాష్ట్ర బడ్జెట్ పై మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ , ప్రభుత్వ విప్, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రతి అడుగులోనూ అభివృద్ధి.. అర్హులైన వారిందరికీ …

Read More »