Breaking News

Monthly Archives: February 2026

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరన

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15వ తేదీ జరిగే మహా శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి వేడుకల వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరించారు. మహాశివరాత్రికి తరలివచ్చే వేలాది భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని …

Read More »

రెండో రోజు మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ మెడికల్ క్యాంప్ రెండో రోజు కొనసాగింది.. భావనీపురం 42 వ డివిజన్ హెచ్ బీ కాలనీ లో ఆదివారం కూడా క్యాంప్ నిర్వహించారు.. వందల సంఖ్యలో స్థానికులు వచ్చి వివిధ ఆరోగ్య సమస్యల పై వైద్యులను సంప్రదించి వైద్య సాయం అందుకున్నారు.. క్యాంప్ లో భాగంగా పీవీఆర్ హాస్పిటల్స్ సిబ్బంది రక్త పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో,పరీక్షలు నిర్వహించారు.. రోగ నిర్ధారణ అయిన వారికి సుజనా ఫౌండేషన్ మందులను సైతం …

Read More »

అద్భుతంగా శ్రీ సత్యసాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమం

-విజయవాడలో ఐక్యతా స్ఫూర్తిని చాటిన శ్రీ సత్యసాయి రన్ & రైడ్ –2026 విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఐక్యతా భావం వ్యాప్తి మరియు ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు లక్ష్యంగా, శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సత్యసాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమం విజయవాడలో అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో, శారద జూనియర్ కళాశాల ఎదుట, ఎస్.కే. షెరిన్ …

Read More »

శ్రీవారి నైవేద్యంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై జగన్ బ్యాచ్ సమాధానం చెప్పాలి…

-ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి నైవేద్యంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం అత్యంత ఆందోళనకరమని తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పేర్కొన్నారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించింది. తిరుపతి హరే రామ హరే కృష్ణ టెంపుల్ వద్ద నుండి …

Read More »

భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ

-తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు -రాజకీయాలకతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో రౌండ్ టేబుల్ నిర్వహించాలి- -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది భక్తుల …

Read More »

ఆంధ్రప్రదేశ్ ‘అజ్ఞాత అద్భుతాల’ ఆవిష్కరణకు పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం

-ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా గ్రామీణ పర్యాటకానికి కొత్త ఊపిరి -వాలంటీర్ యాత్ర సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం..తద్వారా 9 మిలియన్లకు పైగా వ్యూస్, 1,000కి పైగా బుకింగ్ ఎంక్వైరీలు -తక్కువ ఖర్చుతో ఏపీ పర్యాటకానికి జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు – అత్యధిక ప్రభావం చూపే సరికొత్త ప్రచార నమూనాకు శ్రీకారం -ఏపీ పర్యాటక రంగాన్ని కేవలం కొన్ని ప్రదేశాలకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు …

Read More »

ఫిబ్రవరి 9న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం రద్దు

-ప్రజా సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్‌ సేవలను వినియోగించుకోండి -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న 3వ మంత్రులు–కార్యదర్శుల సదస్సు (Ministers’ and Secretaries’ Conference)కు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు మరియు ఇతర జిల్లా అధికారులు వారి బృందం వర్చువల్ విధానంలో హాజరు కావాల్సి ఉన్నందున, ఫిబ్రవరి 9 న జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు …

Read More »

డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ తూర్పుగోదావరి ఎస్ఈ కె తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారులు ఫోను నెంబరు 8688400499 ద్వారా విద్యుత్ సమస్యలను తెలియజేయ వచ్చన్నారు. ఫిబ్రవరి 9న …

Read More »

బాలికల హక్కులు, భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలికల సదనాన్ని సందర్శించి అక్కడ బాలికలకు అందుతున్న వసతులు, సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నివసిస్తున్న బాలికలతో సన్నిహితంగా మాట్లాడి వారి విద్య, ఆరోగ్యం, భద్రత, భోజనం, దైనందిన అవసరాలు తదితర అంశాలపై వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అడిగి తెలుసు కున్నారు. బాలికలు బాగా …

Read More »

సహజ వన్యప్రాణి లక్షణాలకనుగుణంగా ప్రవర్తించిన పులి – నాలుగు గంటలు పాకలో ఉన్నా పశువులకు హాని చేయలేదు

-జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు -అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అప్రమత్తత ప్రశంసనీయం : కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పులి గుడిసె ఇంట్లోకి ప్రవేశించి, అదే పాకలో సుమారు నాలుగు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »