డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ తూర్పుగోదావరి ఎస్ఈ కె తిలక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తారన్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారులు ఫోను నెంబరు 8688400499 ద్వారా విద్యుత్ సమస్యలను తెలియజేయ వచ్చన్నారు. ఫిబ్రవరి 9న విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ ఎదురవుతున్న అంతరాయాలు, హెచ్చు, తగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, టాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి సమస్యలపై నేరుగా సీఎండీ దృష్టికి ఈ సందర్భంగా తీసుకు రావచ్చునని ఎస్ఈ కె తిలక్ కుమార్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *