Breaking News

Monthly Archives: February 2026

విద్యార్తుల కంటి పరీక్షల్లో పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ

-వార్షిక లక్ష్యాన్ని పెంచిన కేంద్రం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -తెనాలిలో కంటి అద్దాల పంపిణీని ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభ రాష్ట్ర కార్యక్రమం మంగళవారం …

Read More »

బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం – ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్లు మంజూరు – ఈ నిధులతో బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధి – బీసీ బిడ్డలకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్యే లక్ష్యం – నేడు సీఎం చంద్రబాబుతో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష : మంత్రి సవిత అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య …

Read More »

యల్.బి.ఆర్.సి.ఈ లో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై భారత్ (MY Bharat) కార్యక్రమం భాగంగా లక్కీరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యన్.యస్.యస్. యూనిట్ ఆధ్వర్యంలో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం (Inter-State Youth Exchange Program) (03-02-2026 నుండి 07-02-2026) ఐదు రోజుల పాటు జరుగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా స్టేట్ యన్.యస్.యస్ ఆఫీసర్ డా.యమ్.సుధాకర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య సాంస్కృతిక అవగాహన, జాతీయ సమగ్రతను మరియు …

Read More »

ఫిబ్రవరి 3న ‘డెలాయిట్’ నిపుణులతో కేంద్ర బడ్జెట్ 2026-27పై వర్చువల్ విశ్లేషణ సదస్సు: ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ఆధ్వర్యంలో, ప్రముఖ ఆడిట్ మరియు కన్సల్టింగ్ సంస్థ ‘డెలాయిట్’ (Deloitte) నిపుణుల సహకారంతో రేపు (మంగళవారం), అనగా ఫిబ్రవరి 3, 2026 సాయంత్రం 5:00 గంటలకు కేంద్ర బడ్జెట్ 2026-27పై వర్చువల్ విశ్లేషణ సదస్సు నిర్వహించబడుతుంది. కేంద్ర బడ్జెట్ మరియు పరిశ్రమలు, ఎంఎస్ఎమ్ఈ (MSME)లు, అంకుర సంస్థలు (Start-ups), వృత్తి నిపుణులు మరియు విస్తృత ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం గురించి సమగ్రమైన విశ్లేషణను అందించడమే …

Read More »

కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్య రక్షణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. వృత్తిపరమైన భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్–2020 అమలులో కార్మికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై, ముఖ్యంగా నిర్మాణ రంగం, గనులు, కాంట్రాక్ట్ కార్మికులు వంటి ప్రమాదకర రంగాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానం ఇస్తూ, 13 కేంద్ర …

Read More »

ఈఎస్‌ఐ డిస్పెన్సరీల జాప్యంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

-కలిచేడు, తలుపూరు ఎంఎల్‌డబ్ల్యూఓ పాఠశాల పునరుద్ధరణపై అనుబంధ ప్రశ్న న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఇందుకు అనుబంధ ప్రశ్నగా 2023 నవంబర్‌లో కలిచేడు, తలుపూరు ప్రాంతాల్లో ఎంఎల్‌డబ్ల్యూఓ పాఠశాల భవనాల పునరుద్ధరణకు సంబంధించిన లేవుట్‌లు, డ్రాయింగ్‌లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు తదుపరి కార్యాచరణ ప్రారంభం కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే 1950లో కలిచేడులో నిర్మించిన జనరల్ ఆసుపత్రి, టీబీ ఆసుపత్రుల సేవలను ప్రభుత్వం ఎప్పుడు …

Read More »

ఎఐబీఎస్​పీ ఆధ్వరంలో ధర్నా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఎఐబీఎస్​పీ రాష్ట్ర సమన్వయకర్త బ‌క్కా ప‌రంజ్యోతి ఆధ్వర్యంలో ఈరోజు  యానాది, ఎరుకల వారి సమస్యేలపై ఒంగోలు ఎఐబీఎస్​పీ జిల్లా అధ్యక్షులు పర్యవేక్షణ బాధ్యత తో ఎస్సీ, ఎస్టీ తండాల వారి సమస్య లు పరిష్కారం చెయ్యాలి అని ట్రైబల్ వెలిఫర్ కమిషన్ ఆఫీస్ వద్ద ధర్నాచెశారు. రాష్ట్ర ప్రభుత్వం  గిరిజనుల కోసం విడుదల చేసిన నిధులను విడుదలచేయాలని కోరారు  ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ జిల్లా ఎఐబీఎస్​పీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌, సెక్రటరీ శివ మల్లవల్లి శివ, …

Read More »

ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, 2026-27 ట్రేడ్ ఫీజులు జనరేట్ అయినందున నెలాఖరులోపు చెల్లించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య చట్ట ప్రకారం నగర పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, లేని వారు తక్షణం అందుబాటులోని వార్డ్ సచివాలయంలోని శానిటేషన్ కార్యదర్శికి దరఖాస్తులు అందించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లపై …

Read More »

కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను ఒక్కరోజులోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి ఒక్కరోజులోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆధార్ సీడింగ్, జిఆర్పీ సేవల కోసం అనేక రోజుల …

Read More »

అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: అన్నక్యాంటీన్లలో మౌలిక వసతులపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్ లు, త్రాగునీరు, పారిశుధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, …

Read More »