Breaking News

Monthly Archives: February 2026

రాష్ట్రంలో 72 లక్షల మందికి వైద్య పరీక్షలు

-రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం -సంజీవని ప్రాజెక్టు సహకారంపై త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక -కుప్పంలోని తుమ్మిశిలో ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు పరిశీలించిన సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు. కుప్పం నియోజకర్గం శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలోని …

Read More »

ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తున్నా

-పార్టీని బలోపేతం చేసిన వారిని నేను బలోపేతం చేస్తా -చక్కటి పనితీరుతోనే పదవులు దక్కుతాయి -కుప్పం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోసం… పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ఎవ్వరి రికమెండేషన్లు అక్కర్లేదని… పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డికి అలాగే పదవి దక్కిందని సీఎం వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ …

Read More »

ఎకానమీకి పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్

-దీర్ఘ కాలిక లక్ష్యాల సాధనకు ఈ బడ్జెట్ దారి చూపుతుంది : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశాన్ని స్థిరమైన, బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ దేశానికి స్పష్టమైన దారి చూపిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక పురోగతి సాధించేలా 2026-27 కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కి, అలానే 9 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు, …

Read More »

వికసిత సంకల్పం… యువశక్తి ప్రేరేపితం

-ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్ -ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు -వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ కి అభినందనలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో యువశక్తిని మేల్కొల్పాలి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మౌలిక ప్రగతికి బాటలు వేయడం ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం… ప్రధానమంత్రి …

Read More »

సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్

-పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు -“మీకోసం”  వెబ్ సైట్ లో  పి.జి.ఆర్.ఎస్ అర్జీలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను  ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు …

Read More »

ఫిబ్రవరి 2న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …

Read More »

కుల స్పృహతో ఉద్యమిస్తేనే రాజ్యాధికారం

– బీసీలు రెండుకులనాయకుల కపట ప్రేమలకు పడిపోవద్దు – రిటైర్డ్​ డీజీపీ, ఏఐబీఎస్​పీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్​ జె.పూర్ణచంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు కులాలు అధికారమే లక్ష్యంగా .. రాజకీయమే వృత్తిగా మార్చుకుని వారసత్వ రాజకీయాలతో .. అనాధిగా చేస్తున్న కుట్రలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ పదునైన వ్యూహాలతో అడుగులేస్తేనే బీసీలకు రాజ్యాధికారం సాకారమవుతుందని రిటైర్డ్​ డీజీపీ, ఏఐబీఎస్​పీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్​ జె.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ.. గవర్నర్​పేటలోని బాలోత్సవ్​ భవన్​లో బీసీ చైతన్య వేదిక …

Read More »

రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై నూతన జేఏసీ ఏర్పాటు!… : రవీంద్ర రాజు భూపతి రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రూపకల్పన జరిగిందని, అందులో భాగంగానే నేడు జేఏసీ రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు స్పష్టం చేశారు. ఆదివారం, ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం గాంధీనగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు …

Read More »

ప్రభుత్వమా? రియల్ ఎస్టేట్ బ్రోకరా? అమరావతి భూసేకరణపై వెల్లువెత్తుతున్న నిరసనలు… : వడ్డే శోభనాధిశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న భూసేకరణ విధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రజా సమస్యలను పరిష్కరించి మెరుగైన పరిపాలన అందించాల్సిన ప్రభుత్వం నేడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వడ్డే శోభనాద్రిశ్వరరావు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి, ప్రైవేట్ సంస్థల లాభం కోసమే ప్రభుత్వం పాకులాడుతోందన్న ఆరోపణలు …

Read More »

కేంద్ర బడ్జెట్–27పై తిరుపతి ఎంపీ గురుమూర్తి కామెంట్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ముందుగా అభినందిస్తున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి ఆర్థిక లోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించి, 2026–27లో దాన్ని 4.3 శాతానికి పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయం. మూలధన వ్యయానికి 2026–27లో రూ.12.21 లక్షల కోట్లను కేటాయించడం అభివృద్ధికి దోహదపడే చర్యగా భావిస్తున్నాను; ఖర్చులు పెంచినా ఆర్థిక లోటుపై నియంత్రణ కొనసాగించడం అభినందనీయం. అయితే గ్రామీణ ఆర్థిక …

Read More »