Breaking News

Monthly Archives: February 2026

త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ ప్రారంభం

– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవన పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం విమానాశ్రయ అధికారులు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులతో నిర్మాణ పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, …

Read More »

డ్రెడ్జింగ్ బోట్లు సీజ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ మండలం, కాతేరు గ్రామ పరిధిలో గల డిసిల్టేషన్ ఇసుక రీచ్ వద్ద జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో గనులు శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల సందర్భంగా కాతేరు డిసిల్టేషన్ ఇసుక రీచ్ ఒడ్డున మూడు డ్రెడ్జింగ్ బోట్లు అలాగే వాటి సమీపంలో రెండు ఇసుక గుట్టలు ఉన్నట్లు అధికారులు …

Read More »

ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం–2009లోని సెక్షన్ 12(1)(C) ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని IB / CBSE / ICSE / స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన తల్లిదండ్రుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్. సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అడ్మిషన్లు *ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) / వెనుకబడిన వర్గాలు (BC)*కు చెందిన పిల్లలకు వర్తిస్తాయని, …

Read More »

VER గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధిలో తూర్పు గోదావరి కీలక పాత్ర

– కార్యాచరణ, లక్ష్య సాధన పై జిల్లా స్థాయి సమీక్ష – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమైన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER)ను గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో భాగంగా శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా కలెక్టర్ల వర్క్‌షాప్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో VER ప్రాజెక్టుల పురోగతి, జిల్లా స్థాయి అమలు విధానాలపై …

Read More »

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

– జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 09.02.2026 నుంచి 13.02.2026 వరకు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ రాత పరీక్షల (OMR ఆధారిత ఆబ్జెక్టివ్ విధానం) సజావు నిర్వహణకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారిని సమన్వయ అధికారిగా వ్యవహరిస్తున్న డి.ఆర్.ఓ. టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, ఏపీపీఎస్సీ ద్వారా …

Read More »

2047 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ను దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలపేందుకు సీఎం కృషి

-2026–27 కేంద్ర బడ్జెట్ యువత, అభివృద్ధి లక్ష్యంగా రూపొందింపు – కేంద్ర మంత్రి కే. రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని 2047 నాటికి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢమైన చర్యలు చేపడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం స్థానిక ప్రవేటు (మంజీరా) కన్వెన్షన్ హాల్‌లో 2026–27 కేంద్ర బడ్జెట్‌పై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో …

Read More »

గ్రామ స్వరాజ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం:మంత్రి కందుల దుర్గేష్

-మద్దూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ -రూ. 1.30 కోట్లతో కొవ్వూరు నియోజకవర్గం మద్దూరులో గ్రామ సచివాలయ భవనం ప్రారంభం; రైతు సేవా కేంద్రం, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్ -సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ పరుగులు – డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమన్న మంత్రి దుర్గేష్ -సూపర్ సిక్స్ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామని వెల్లడి -గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లన్నీ అభివృద్ధి చేసి గోష్పాద క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం -గత ఐదేళ్ల దోపిడీని చెరిపివేస్తూ అభివృద్ధి పథంలో …

Read More »

మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలి

-శివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రైల్ రన్ : కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 2027 మహా గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని స్నాన ఘాట్లు ఒకే ఆకృతిలో, ఒకే స్ట్రెచ్‌లో ఉండేలా మోడల్ ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ధవళేశ్వరం నుంచి సరస్వతి ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ వరకు ఉన్న పలు ఘాట్లను ఎస్పీ డి. నరసింహ …

Read More »

2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం

-రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -20 నెలల్లో రూ.30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం -“ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం” కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి -సీఎం చంద్రబాబు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని …

Read More »