Breaking News

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

– జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో 09.02.2026 నుంచి 13.02.2026 వరకు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ రాత పరీక్షల (OMR ఆధారిత ఆబ్జెక్టివ్ విధానం) సజావు నిర్వహణకు సంబంధించి జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారిని సమన్వయ అధికారిగా వ్యవహరిస్తున్న డి.ఆర్.ఓ. టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, ఏపీపీఎస్సీ ద్వారా జారీ చేసిన నాలుగు నియామక నోటిఫికేషన్లకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ జారీ చేసిన మార్గదర్శకా లను కచ్చితంగా అనుసరించి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ప్రశ్నాపత్రాలు–OMR షీట్ల రవాణా భద్రత, 144 సెక్షన్ అమలు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పరీక్షా కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో బస్సుల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై శాఖల వారీగా విధులు, బాధ్యతలపై సమగ్రంగా చర్చించడం జరిగిందన్నారు. పరీక్షల సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ నియామక నోటిఫికేషన్లకు సంబంధించి ఫిబ్రవరి 9 నుంచి 13, 2026 వరకు జరిగే మెయిన్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో భద్రత, మౌలిక వసతులు, పరీక్ష నిర్వహణ సిబ్బంది, వైద్య సదుపాయాలు సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

రోజువారీగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలు
09.02.2026 (సోమవారం) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్ పరీక్షలు – 1,72,300 మంది, 10.02.2026 (మంగళవారం) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్ (పేపర్–II) – 1,72,300 మంది, 11.02.2026 (బుధవారం) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III – 20,106 మంది, 12.02.2026 (గురువారం) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III క్వాలిఫైయింగ్ టెస్ట్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 22,452 మంది, 13.02.2026 (శుక్రవారం) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (పేపర్–II & III) – 2,346 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉందన్నారు.

అభ్యర్థులకు సూచనలు:
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, పుస్తకాలు, నోట్స్ వంటి నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు అభ్యర్థులు ఏపీపీఎస్సీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీపి ఎస్సీ, రెవెన్యూ, పోలీసు, పరిక్ష కేంద్రాల నిర్వాహకులు, పోస్టల్, రైల్వే తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *