Breaking News

Daily Archives: March 8, 2026

డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గం, కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. 02.05 గంటలకు స్థానిక రైతులతో ముఖ్యమంత్రి …

Read More »

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

-అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లేశ్వరి ఇంటికి వెళ్లి అభినందించిన హోం మంత్రి -పోలీస్ శాఖకు మల్లేశ్వరి ఆదర్శo -ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు పోలీస్ శాఖకు ఎంతో అవసరం..హోం మంత్రి అనిత గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సిటీ మహిళా ఎస్‌.ఐ.గా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి మల్లేశ్వరిని అభినందించారు. మల్లేశ్వరి …

Read More »

బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం… : డా జె పూర్ణచంద్రరావు మాజీ డిజిపి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు శాతం ఉన్న రజకులులో ఒక్కరూ ఎమ్మెల్యే కాలేదని, సామాజిక న్యాయం జరగాలంటే బీసీలు, ముస్లింలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా శాసనసభలు, రాజ్యసభ,శాసన మండలిలో రిజర్వేషన్లు కల్పించడమే మార్గమని విజయవాడలో జరిగిన రజక (చాకలి) సమాజం సమ్మేళనంలో నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న డా. జె. పూర్ణచంద్రరావు, ఐపీఎస్ (విరమణ), మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు మైనార్టీలకు తగిన …

Read More »

‘స్వయం’ బ్రాండ్ ఉత్పత్తులకు నేనే బ్రాండ్ అంబాసిడర్‌

-మహిళా ఉత్పత్తుల ‘స్వయం ఏపీ’ లోగో ఆవిష్కరణ -మహిళా సంఘాలు రూపొందించిన ‘స్వయం’ ఉత్పత్తులే వాడాలి -వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తాం -వెలుగు 2.0 కిందకు సెర్ప్, మెప్మా సంస్థలు -పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు చర్యలు -స్వయం సహాయ సంఘాలకు రూ.10,100 కోట్ల మెగా చెక్కు అందజేసిన సీఎం -అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడమే …

Read More »

ఇంటి కోసం పోరాడిన మహిళకు న్యాయం

-మహిళా దినోత్సవం రోజున బాధిత మహిళకు న్యాయం చేసిన కలెక్టర్ -మానవత్వం తో పరిమళించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్యాక్రాంతం అయిన తన ఇంటిని తిరిగి పొందేందుకు పోరాడిన మహిళకు న్యాయం చేస్తూ, మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పేరం విజయకుమారి గత కొన్ని నెలలుగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆమె తల్లి–తండ్రులు తన తమ్ముడి పెళ్లి కోసం నక్క లెల్లయ్య వద్ద రూ.70,000 అప్పుగా …

Read More »

రేపు 9న నెల్లూరులో మహిళా జన్ సున్వాయి

-మహిళా సమస్యల పరిష్కారమే అజెండా -రాయపాటి శైలజ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో రేపు మార్చి 9న మహిళా జన సున్వాయి పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని జడ్పి మీటింగ్ హాల్ లో సోమవారం ఉదయం 10.00 గంటల నుండి …

Read More »

ప్రభుత్వాసుపత్రుల్లో ‘ఏఐ’ యుగానికి శ్రీకారం

-స్టార్టప్ సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా 18 ఆస్పత్రుల్లో సరికొత్త ఆవిష్కరణలు -సుమారు 40 పరికరాలతో 15 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు -సర్వైకల్ క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ, ఇతర అనారోగ్యాల గుర్తింపు -అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా కూడా వైద్య సేవలు -తక్కువ సమయంలో వ్యాధుల నిర్ధారణ – వైద్య సేవల్లో నాణ్యత మరింత మెరుగు -ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా తొలి అడుగులు, మరింత ముందుకు దూసుకువెళ్తాo -వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

క‌చ్చిత‌త్వంతో ఏకీకృత కుటుంబ స‌ర్వే

– స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు డైరెక్టర్ ఎం.శివప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల లక్ష్యసాధన, సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణ, సేవ‌ల పంపిణీని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్‌)ను అభివృద్ధి చేస్తోంద‌ని.. ఇందులో భాగంగా క‌చ్చిత‌త్వంతో ఏకీకృత కుటుంబ స‌ర్వే (UFS) నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు డైరెక్టర్ ఎం.శివ ప్రసాద్ అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలోని పటమట ప్రాంతంతో పాటు రూరల్ లోని గొల్లపూడి, అదేవిధంగా కొండపల్లి …

Read More »

ఘనంగా శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్యేషు దాసి.. కరణేశు మంత్రి… భోజ్యేశు మాత… అన్న పెద్దల మాటల గుర్తు చేసుకునే విధంగా ఘనంగా శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆదివారం గాంధీనగర్‌లోని కూరగాయల మార్కెట్ సమీపంలో శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో యువతకు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని సైకిల్ యాత్ర ద్వారా చైతన్యపరిస్తూ 34 రోజులపాటు …

Read More »

మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి… : డా. పసుపులేటి హరిప్రసాద్ 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని రాస్ బిల్డింగ్‌లో రమణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు  మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్  మాట్లాడుతూ మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి అని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ప్రధాన …

Read More »