Breaking News

రేపు 9న నెల్లూరులో మహిళా జన్ సున్వాయి

-మహిళా సమస్యల పరిష్కారమే అజెండా
-రాయపాటి శైలజ

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లాలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో రేపు మార్చి 9న మహిళా జన సున్వాయి పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని జడ్పి మీటింగ్ హాల్ లో సోమవారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి వారి సమస్యలను మహిళా కమిషన్ కు విన్నవించి పరిష్కరించుకోవాలని ఈ ప్రకటనలో తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *