-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఉన్న రోడ్ల పైన గుంతలు త్వరితగతిన పూడ్చాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఇంజనీరింగ్ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్లో కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంతలు లేని నగరంగా విజయవాడ ను ఉంచాలని, నగరంలో ఉన్న అన్ని రోడ్లపై గుంతలను త్వరితగతిన పూడ్చాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న రోడ్లపై గుంతలను, ప్రతి వార్డ్ లో పూడ్చుకుంటూ, వార్డుల వారీగా ఒకవైపు గుంతలను మరో వైపు డ్రైన్ ల మరమతులను పూర్తి చేస్తూ రావాలని అన్నారు. పనులు జరిగేటప్పుడు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు.