గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 23, 24 తేదీలు (శని, ఆదివారాల్లో) రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ సమ్మరి రివిజన్ 2025లో భాగంగా స్పెషల్ క్యాంపెయిన్ డే జరుగుతుందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో శని,ఆదివారాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ జరుగుతాయని, బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. క్యాంప్ ల్లో జనవరి 1,2025 నాటికి 18 ఏళ్లు నిండే వారు, ఇప్పటి వరకు ఓటు లేని వారు నూతన ఓటు కై ఫారం-6, ఓటర్ లిస్టు పై అభ్యంతరాలను ఫారం-7, ఓటు వివరాలు తప్పుగా నమోదు అయిన వారు ఫారం-8(కరెక్షన్) ఫారాలను బిఎల్ఓలుకు అందించవచ్చని తెలిపారు. అలాగే ceoandhra.nic.in నందు కూడా ఆన్ లైన్ లో ఫారం 6,78 లను దాఖలు చేసుకోవచ్చని తెలిపారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …