Breaking News

పేదల ఆరోగ్యానికి చంద్రబాబు నాయుడు భరోసా

-ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1.10 లక్షలు
-ఎల్‌వోసీలను స్వయంగా అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసాగా నిలుస్తున్నారని తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ , 15వ డివిజన్లలో వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1.10 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ శాసనసభ్యుని కార్యాలయంలో శుక్రవారం ఉదయం స్వయంగా వైద్యం చేయించుకునేవారి కుటుంబ సభ్యులకు అందచేశారు. 2వ డివిజనుకు చెందిన డి. కనకదుర్గకు ఆపరేషన్ నిమిత్తం రూ.60,000, 15వ డివిజనుకు చెందిన బి.స్పందనకు ఆపరేషన్ నిమిత్తం రూ.50.000 ల ఎల్.ఒ.సి.లను గద్దె రామమోహన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని పేదల వైద్యానికి అయ్యే ఖర్చులో అత్యధిక భాగాన్ని అందచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందచేయడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా వైద్య ఖర్చులను తిరిగి వారికి అందచేస్తున్నారని, ఇంకా కొందరికి వైద్యం చేయించుకోవడానికి తక్షణం నిదులు లేని వారికి ఎల్.ఒ.సి. ద్వారా అందచేస్తున్నారని తెలిపారు. వైద్య ఖర్చులకు అయ్యే వ్యయం పేదలకు భారం కాకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. గత ఐదు సంవత్సరాల వైఎస్సార్‌సీపీ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ఫ కాలంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందిన కుటుంబాలు త్వరగా కోలుకుని సాధారణ జీవితాన్ని పొందాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అభిలషించారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఎల్‌వోసీ పత్రాన్ని అందుకున్న కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *