విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ది విజయవాడ పూల వర్తక గుమాస్తాలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గొల్లపూడిలో హోల్‌సేల్ మార్కెట్ సమీపంలోని కొత్తగా నిర్మిస్తున్న పూలమార్కెట్ సమీపంలో బొమ్మసాని సుబ్బారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ పూల వర్తక గుమాస్తాలు సంక్షేమం కోసం తనవంతుగా అన్ని విధాలా కృషిచేసి సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. త్వరలో రాబోతున్న పూల మార్కెట్‌కు అందరికీ అన్ని విధాలుగా ఉపయోగకరంగా వుండి వారి అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన ది విజయవాడ పూల వర్తక గుమాస్తాలు సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రెసిడెంట్ ఎస్‌కె మహ్మద్ హనీఫ్, సెక్రటరీ ఎస్‌కె జావిద్ హుస్సేన్, కోశాధికారి కె.దాసు సంఘ సభ్యులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి పూల కిరీటం ధరింప చేసి, గజమాల, శాలువాతో సత్కరించి భారీ కేక్‌ను కట్‌చేసి పంపిణీ చేసి బాణా సంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పూలవర్తకులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …