-త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని నాయకులను ఆదేశించిన పులివర్తి నాని
-అసెంబ్లీ ముగిసిన వెంటనే విజయవాడ నుండి నేరుగా నారావారిపల్లెకు చేరుకున్న ఎమ్మెల్యే
-నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28న నారావారిపల్లెలో నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న పులివర్తి నాని గారు శనివారం విజయవాడ నుండి నేరుగా నారావారిపల్లెకు చేరుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను నాయకులతో కలిసి పరిశీలించారు. కర్మ క్రియలకు హాజరయ్యే వారికి వాహన పార్కింగ్, త్రాగునీరు, భోజన వసతి వంటివి జాగ్రత్తగా చేయాలని నాయకులకు నాని గారు దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లు చేస్తున్న ప్రాంతాన్ని నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి కలియతిరిగి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక తెదేపా నాయకులు పాల్గొన్నారు.