Breaking News

బాలికల వసతి గృహం ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి

వినుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వినుకొండ బి.ఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ (వినుకొండ ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సాంకేతిక విద్య అందించే ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో గురుకులాలను తీసుకొస్తామన్నారు. బాలికలు ఇంటర్ తోనే ఆగిపోకుండా డిగ్రీలో కూడా గురుకులాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

డీఎస్సీ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 3000 మంది వరకూ ఉపాధ్యాయులను నియమించి గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. బాలికల ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గురుకులాల నుంచి ఐఐటీ, ఎంబీబీఎస్ సీట్లు సాధించే పిల్లల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ రూ.6 కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన వసతులను బాలికలు చక్కగా వినియోగించుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు.

ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ గురుకులాల్లో పూర్తి స్థాయిలో బోధనా సిబ్బందిని నియమించాలని, బాల్య వివాహాలను నిరోధించేందుకు బాలికలకు ఉన్నత విద్యావకాశాలు పెంచాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *