-బాలికల వసతి గృహం ప్రారంభోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్
వినుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం మధ్యాహ్నం వినుకొండ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ రవికుమార్ మాట్లాడుతూ… విద్యార్థులందరూ డాక్టర్ బీ ఆర్. అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని చివరకు గొప్ప స్థాయికి ఎదిగారని కీర్తించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులను కేవలం చదువు మాత్రమే ఉన్నత స్థాయిలో నిలుపుతుందని పేర్కొన్నారు. కొండేపి లోని ఓ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కూడా చదువు మీద ఆసక్తితో అంతకంతకు ఎదిగి నేడు మంత్రి హోదాలో ఉన్నట్లు గుర్తు చేశారు. సమాజంలోని అసమానతులను తొలగించాలంటే చదివే గొప్ప ఆయుధమని విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.