గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు నగర పాలక సంస్థ అందించే సేవల పై సందేహాలకు జి.య.సి కాల్ సెంటర్
ప్రజల సమస్యలను సత్వర పరిష్కారం కొరకు నగర పాలక సంస్థ కాల్ సెంటర్ విస్తృత సేవలను అందిస్తోందని, నగర ప్రజల కొరకు నగర పాలక సంస్థ అందిస్తున్న సేవల పై ఈ నెల 25 నుండి (ఆస్తి పన్ను మార్పు, ఆస్తి పన్ను విధింపు, నీటి కుళాయిల కనెక్షన్ లు, కుళాయిల రిపేర్లు, డ్రైన్ కనెక్షన్ లు,రిపేర్ లు, వ్యాపార లైసెన్సులు, జనన మరణ ధ్రువ పత్రాల మార్గ దర్శకాలు, వివాహ పత్రాల నమోదు) సేవల పై ఎటువంటి సందేహాలు ఉన్నా 0863-2345103, 104, 105 నెంబర్లకు సంప్రదించి సమాచారాన్ని పొందవచ్చునని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ గారు మాట్లాడుతూ, నగర పాలక సంస్థ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు వీలైనంత త్వరలో సాంకేతిక అనుసంధానంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నగర పాలక సంస్థ కాల్ సెంటర్ ద్వారా వివిధ ప్రజా సమస్యల పరిష్కరిస్తున్నామన్నారు. సోమవారం నుండి నగర పాలక సంస్థ సచివాలయాల ద్వారా రెవిన్యూ, ప్రజారోగ్యం మరియు ఇంజనీరింగ్ విభాగాలలో అందించే సేవల పై సందేహాల నివృత్తికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవాలన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం అందుబాటులో ఉంటే మరియు సంబంధిత ఫీజులు చెల్లించిన వెంటనే, మీకు కావలసిన సేవను తక్షణమే అందించబడుతుందన్నారు. ఈ సేవలపైనా సీనియర్ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. నగర పాలక సంస్థ కాల్ సెంటర్ ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు, సెలవు దినాలలో కూడా సేవలు అందిస్తుందన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …