Breaking News

ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు నిర్మించి తీరుతాం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-10 వేల మందికి ఉపాధి కల్పన
-పేదలకు, చేనేతలకు మధ్య చిచ్చు పెట్టిన జగన్
-ఆయన చేనేత ద్రోహి : జగన్ మంత్రి సవిత ఫైర్

కర్నూలు/ఎమ్మిగనూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు నిర్మించి తీరుతామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి స్పష్టంచేశారు. ఆదివారం ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గడిచిన అయదేళ్లలో చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. 2014-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ నిర్మించడానికి వంద ఎకరాలను కేటాయించిందన్నారు. చేనేతల అభివృద్ది చెందడాన్ని జీర్ణించుకోలేని జగన్ రెడ్డి… ఆ స్థలంలో పేదల పేరుతో కొందరికి ఇళ్ల స్థలాలు కేటాయించారన్నారు. చేనేతలకు, పేదలకు మధ్య ఘర్షణ సృష్టించాలని జగన్ రెడ్డి కుట్ర పన్నారని, ఆయన చేనేతల ద్రోహి అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇదే విషయమై ఇటీవల అసెంబ్లీలో కూడా స్పష్టంచేశామన్నారు. ముందుగా రూ.3.75 కోట్లతో టైక్స టైల్స్ పార్కులో మౌలిక సదుపాయలు కల్పించనున్నామన్నారు. ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కు ద్వారా 5 నుంచి 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల మధ్య చిచ్చు పెట్టే కుట్రకు తెరతీసిన జగన్ .. టెక్స్ టైల్స్ పార్కు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలకు కేటాయించారన్నారు. వేల మంది పొట్ట కొట్టి, పదుల సంఖ్యలో పేదలకు ఇళ్లకు కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదే విషయం ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే స్పందించిన మంత్రి సవిత… టెక్స్ టైల్స్ పార్కుకు తిరిగి స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాల జారీ చేశారంటూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బత్తిపాటి నాగరాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *