-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ కొండ వద్ద ఉన్న ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వన్ టౌన్ గాంధీ హిల్ లో ఉన్న ప్లానిటోరియంలో ప్రజలు ఇకనుండి వీక్షించవచ్చని అన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే గాంధీ హిల్ లో అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు ఏర్పాటు చేసిన ప్లానెటోరియం ను ప్రజలందరూ వీక్షించవలసిందిగా కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు 40 రూపాయలు ప్రవేశ టికెట్ గా పెట్టినట్లు తెలిపారు. 63 సిట్టింగ్ కెపాసిటీ గల ప్లానిటోరియంను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో, పాఠశాలల నుండి ప్రత్యేక బుకింగ్ చేసుకున్న వారికి 50% ప్రవేశ రుసుము లో రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.
బుధవారం నుండి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రతి అరగంటకు షో వేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల/ కళాశాలలు నుండి ప్రత్యేకంగా బుకింగ్స్ చేసుకున్న వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు వారు బుకింగ్ చేసుకున్న సమయంలో షో వేస్తామని తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహణ కొరకు సెలవు అని అన్నారు. విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న గాంధీ కొండ ప్లానిటోరియంలో వీక్షించి అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ప్రజలందరినీ కోరారు.