Breaking News

యువతకు స్ఫూర్తిదాయకంగా “యువ కెరటాలు” కార్యక్రమం

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు స్ఫూర్తిదాయకంగా “యువ కెరటాలు” కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి యువ కెరటాలు కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల నిస్తేజంగా ఉన్న యువతను చైతన్యవంతం చేయుటకు, వారిలో నూతన ఉత్సాహం ఉత్తేజం కలిగించేందుకు వారిలో స్ఫూర్తి ఆత్మ స్థైర్యం నింపేందుకు 2025 జనవరి మొదటి వారంలో యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా వచ్చే ఫిబ్రవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.

మచిలీపట్నం పోర్టు పనులు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రెండు వారాలకోసారి పోర్టు పనులు సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ యువతలో దాగివున్న సృజనాత్మకత, టాలెంట్ వెలికి తీసి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తే జీవితంలో వారు ఎదగగలరని, ఇందుకు యువకెరటాలు కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. పాఠశాల, కళాశాలల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా యువతను మోటివేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇస్రో, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, సైబర్ క్రైమ్ వంటి పలు విషయాల్లో అవగాహన పెంపొందించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రముఖులతో మోటివేషనల్ స్పీచెస్ ఇప్పించడం, జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తులతో స్ఫూర్తి దాయక ప్రసంగాలతో యువతలో చైతన్యం తీసుకురావడం ముఖ్య ఉద్దేశం అన్నారు.

తొలుత ఈ సమావేశంలో ఆనంద్ గతంలో నిర్వహించిన యువ కెరటాలు కార్యక్రమం వివరాలు సమావేశంలో అధికారులకు వివరించారు. కృష్ణా తరంగ్ ఇంటర్ కాలేజీఏట్ యూత్ ఫెస్టివల్ బ్రోచర్ విడుదల చేసిన మంత్రి

కృష్ణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడ కేబీఎన్ కళాశాలలో నిర్వహించు కృష్ణా తరంగ్ ఇంటర్ కాలేజీఏట్ యూత్ ఫెస్టివల్ బ్రోచర్ మంత్రి ఈ సమావేశంలో విడుదల చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్  ప్రొఫెసర్ కే శోభన్ బాబు, రెక్టార్ బసవేశ్వర రావు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, ఆర్డిఓ కే స్వాతి, డీఈవో  పి వి జె రామారావు, డీఎస్పీ ఎండి అబ్దుల్ సుభాని, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *