Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 222 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్)కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని రీ ఓపెన్ కు తావు లేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో, వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను త్వరిత గతిన అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, డి ఆర్ ఓ నరసింహులు, తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -135, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -10, డి ఆర్ డి ఏ -6, మెడికల్ అండ్ హెల్త్- 4, బి. సి వెల్ఫేర్ -1, పంచాయతీరాజ్ – 19, స్కిల్ డెవలప్మెంట్ -1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -6, పోలీస్ శాఖ – 8 , రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ -2, సమగ్ర శిక్ష -1, అటవీ శాఖ -3, సివిల్ సప్లైస్ -3, హౌసింగ్ -2, వాటర్ రిసోర్సెస్ -4, డ్వామా -6, ఏ. పీ ఎస్. పీ. డి. సి . ఎల్ -1, ఎన్. హెచ్. ఏ. ఐ -1, డిసెబిలిటీ -1,స్కూల్ ఎడ్యుకేషన్ -1, డ్రగ్ ఇన్స్పెక్టర్ -1, ఏ. పీ. ఐ. ఐ. సి -1, జి. ఎస్. డబ్ల్యూ . ఎస్- 2, సోషల్ వెల్ఫేర్ -2 వెరసి మొత్తం 222 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *