-హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా లింగ ఆధారిత హింసకు వ్యతిరేకoగా అవగాహన కార్యక్రమాలను నవంబరు 25 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో తిరుపతి రూరల్ మండలంలో డి ఆర్ డి ఎ వారి అధర్వoలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నానితో కలిసి లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార కార్యక్రమoను నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతందన్నారు. చిన్న పిల్లల మీద జరుగుతున్న, అఘాయిత్యాలు, మహిళలు పై జరుగుతున్న గృహహింస, వరకట్నం కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని నివారణ దిశగా మహిళల హక్కులు, రక్షణ కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయని అన్నారు. కావున మహిళలు ధైర్యంగా మీకు జరిగిన అన్యాయాన్ని చెప్తే, మీకు అండగా జిల్లా యంత్రాంగం, ఎంఎల్ఏ మీకు తోడుగా ఉంటారని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని కారణంగా చిన్న వయసులో గర్భం దాల్చడం జరుగుతోందని, సచివాలయం సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు ఈ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లలను తమ తల్లిదoడ్రులకు పదవ తరగతి వరకు కాకుండా ఉన్నత చదువులు చదివించాలనే బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. మహిళలు, చిన్న పిల్లల మీద నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా ఉంచకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా వారిని ఎప్పుడూ గమనించుకోవాలన్నారు. మనం అందరం కలిసి కట్టుగా లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార దిశగా ముందు అడుగు వేద్దాం అన్నారు. అనంతరం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార కార్యక్రమం పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి విడుదల చేసి స్వయం సహాయక సంఘ సభ్యులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.
ఎంఎల్ఏ మాట్లాడుతూ.. స్త్రీలేక పోతే మనిషికి పుట్టుకలేదు, హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించాలని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళల సంక్షేమం దిశగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహిళల వసతి గృహాలను తీసుకు రావడం జరిగిందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ, ఐ సి డి ఎస్ పి డి లు శోభన్ బాబు, జయలక్ష్మి, ఎ పి డి ప్రభావతి, స్వయం సహాయక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.