Breaking News

ఎన్పీసీఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ ఈ నెల 30 నాటికి తప్పకుండా పూర్తి చేయాలి

-పీజీ ఆర్ ఎస్ అర్జీలు నాణ్యతగా బియాండ్ ఎస్ ఎల్ ఎ కు వెళ్లకుండా నాణ్యతగా పరిష్కరించాలి
-ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వరాదు
-పాట్ హోల్ ఫ్రీ రహదారుల పనులు నాణ్యతగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
పిజిఆర్ఎస్ అర్జీల పెండింగ్ అంశాలపై, ఉచిత ఇసుక అమలు పై, ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్, ఎంఎంఎస్ఎంఈ సర్వే, నరేగా, పాట్ హోల్స్ ఫ్రీ రోడ్లు తదితర అంశాలలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని అన్ని మునిసిపల్ కమిషనర్లు, మండలాల ఎంపిడిఓలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది జిల్లా అధికారులు, డివిజన్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య లతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. నూతన ఉచిత ఇసుక పాలసీ అమలు పక్కాగా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్పీసీఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ చేయడం పై సమీక్షిస్తూ ఏర్పేడు, వెంకటగిరి, కెవిబిపురం మండలాలు సదరు అంశం నందు తక్కువ పురోగతి ఉందని, పుత్తూరు మునిసిపాలిటీ పనితీరు ఇందులో బాగుందని ఈ కార్యక్రమం ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని తెలిపారు.

ఎంఎస్ఎంఈ సర్వే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి త్వరిత గతిన గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీపం -2 అమలు క్షేత్ర స్థాయిలో జాగ్రత్త గా చేపట్టాలని సూచించారు.

ఏపీ సేవ పెండింగ్ రెవెన్యూ శాఖ సంబంధిత పెండింగ్ అర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలని, ఇతర శాఖల పెండింగ్ అంశాలు త్వరిత గతిన పరిష్కరించాలని, బియాండ్ ఎస్ ఎల్ ఏ కి వెళ్లకుండా నాణ్యతగా పరిష్కరించాలని అన్నారు.

నరేగా సంబంధిత పనుల పురోగతి సమీక్షిస్తూ ఇంకనూ ప్రారంభం కాని పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అలాగే సీసీ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలి అని సూచించారు.

పాట్ హోల్స్ ఫ్రీ రహదారులు కాన్సెప్ట్ కింద ఆర్ అండ్ బి కింద 66 పనులు మొదటి విడతగా చేపట్టినవి త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే మునిసిపాలిటీలలో కూడా పాట్ హోల్స్ ఫ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అన్ని మునిసిపాలిటీ లలో నాణ్యతగా చేపట్టాలని, సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. స్వయానా గౌ. ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్షిస్తున్నారని, జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు.

అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ట్యూషన్ ఫీజు కొరకు ఇబ్బంది పెట్టరాదని, ఎవరైనా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తప్పక పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు కలెక్టరేట్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *