Breaking News

పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు  ఒక అడుగు – తల్లి దండ్రులతో ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, జిల్లా విద్యాశాఖ అధికారి కె వి ఎన్ కుమార్ తో కలసి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణ పై మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓ లు, తహశీల్దార్లు, ఎంపిడిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిల్లో ఎంపీడీవోలు, తాసిల్దారులు, ఎంఈఓ లు ముందుకు తీసుకు వెళ్లేలా దృష్టి పెట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు సమక్షంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో బోధన విధానం పర్యవేక్షణ గురించి విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, హాస్టల్ విద్యార్థికి అసెస్మెంట్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి కార్డులను అందించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి కార్డుల పంపిణీ ఉంటుందని, పాఠశాలలకు కార్డులు అందిన తరువాత విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు కార్డు పై నమోదు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పాఠశాల స్థాయిలో హెచ్ ఎం లు బాధ్యత తీసుకోవాలన్నారు. పేరెంట్ మీటింగ్ రోజున డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించే మెనూ ప్రకారం ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి భోజనం చేయాలని తెలిపారు. పాఠశాలలోనీ మౌలిక సదుపాయాల గురించి సమావేశంలో సమీక్షించి పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించేలా కృషి చేయాలి అన్నారు. విద్యను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రo అమలు చేస్తున్న విధానాలను గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. తోటి వారితో ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తన నియమాలను గురించి తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మీటింగ్ కు తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించాలని పాఠశాలలో విద్యా విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం విధానం, తాగునీరు, పారిశుద్ధ్యం, రక్తహీనత, వారి ఆరోగ్య సమస్యలు తదితర సమస్యలను అడిగి తెలుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో బాలికలకు గుడ్ టచ్ బాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని, ఎంఈఓలతో పాటు తహశీల్దార్, ఎంపిడిఓ లు కూడా పాల్గొనాలని, సచివాలయ సిబ్బందిని కూడా బాగస్వామ్యం చేయాలన్నారు. పూర్వ విద్యార్థులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని తెలిపారు.
ఈ సమావేశంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్, డిపిఓ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *