-వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలి.
-డిజిటల్ లావాదేవీలు నిర్వహణా సామర్ధ్యం పెంచుకోవాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. పి జి ఆర్ ఎస్ కార్యక్రమం సందర్భంగా జిల్లా చేనేత – జౌళి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రవేశం ద్వారం హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి రు.1830/-లు విలువగల చేనే చీరను కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా ధరను చెల్లించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చనన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే చేనేత వస్త్రాల వినియోగం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలన్నారు.
చేనేత – జౌళి శాఖ పరంగా తమ ఉత్పత్తులను మార్కెట్ సౌకర్యాన్ని మరింత పెంచుకునేందుకు డిజిటల్ లావాదేవీలు నిర్వహణా సామర్ధ్యం పెంచుకోవాలన్నారు. ఎంపిక చేసిన వస్త్రాలపై 30 శాతం రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డి ఆర్ వో టి. సీతారామమూర్తి, చేనేత – జౌలి శాఖ సహాయ సంచాలకులు పెద్దిరాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.