-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో దరఖాస్తు చేసిన వెంటనే నాగులపల్లి ఆదిలక్ష్మికి ట్రై సైకిల్ అందచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం 45వ వార్డులో నివాసముంటున్న మానసిక దివ్యాంగురాలు నాగులపల్లి ఆదిలక్ష్మికి రు. 8,500 రూపాయలు విలువ గల ట్రై సైకిల్ ను అందజేశారు. విభిన్న ప్రతిభావంతులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలంటే మరొకరిపై ఆధారపడి పరిస్థితి ఉంటుందని, వారికి చేదోడుగా సహాయకారిగా ఉండేందుకు ఉచితంగా మూడు చక్రాల సైకిల్స్ ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ఈ సందర్భముగా ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారి అభ్యర్థన మేరకు బ్యాటరీతో కూడిన ట్రై సైకిల్ కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డిఆర్ఓ టి. సీతారామమూర్తి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.