-బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కే ఎన్ జ్యోతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు, వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నవంబర్ 27 బుధవారం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కే ఎన్ జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కావాలని తెలియ చేశారు. విజయవాడ లో నిర్వహించనున్న ” సివిల్స్ ” ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలని తెలియజేసి వున్నారు. తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని బి.సి స్టడీ సర్కిల్ నందు ది.27-11-2024 న స్క్రీనింగ్ పరీక్షకు హాజరకు అభ్యర్థులందరూ తమ ఆధార్ కార్డులతో ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్ ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న బీసీ స్టడీ వద్దకు రావాలని తెలియ చేశారు.