-ఎస్బిఐ ఖాతా నెంబరు 62064060623 IFSC కోడ్ SBIN0020974 జమ చెయ్యండి
-అందించే విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్లాగ్ దినోత్సవం సందర్భంగా వితరణ అందించి తమ వంతు దేశభక్తిని చాటాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవ పోస్టర్ ను కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డా. సత్యప్రసాద్ లతో కలసి ఆవిష్కరించారు.
ఈ కలెక్టర్ పి ప్రశాంతి సందర్బంగా మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు మాసములో ఏడవ తేదిన నిర్వహించు కోవడం జరుగుతుందన్నారు. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు కృషిచేస్తాయన్నారు. వారు అనునిత్యం మన భద్రతను, దేశ భద్రతకు సంబంధించి అహర్నిశలు పాటు పడడం చేస్తుంటారని పేర్కొన్నారు. వారి సంక్షేమం, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఫ్లాగ్ డే సంధర్భంగా మనం అందించే విరాళాలు ఒక మంచి కార్యక్రమం కోసం సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
విరాళాలు అందచేసే వ్యక్తులు సంస్థలు, జిల్లా సైనిక్ సంక్షేమ కార్యాలయం వారి పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జిల్లా పరిషత్ శాఖ, కాకినాడ బ్రాంచ్ లోని ఖాతా సంఖ్య 62064060623 IFSC కోడ్ SBIN0020974 నేరుగా జమ చేయవచ్చునని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డా. సత్యప్రసాద్ తెలియ చేశారు. విరాళాలు అందచేసే వారికి ఇన్ కమ్ టాక్స్ నుంచి మినహాయింపులు వర్తించడం జరుగుతుందని జిల్లా సైనిక సంక్షేమ అధికారి తెలియ చేశారు.