గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను నేరుగా పరిశీలించిన తర్వాతనే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ సంగడిగుంట, శారదా కాలనీల్లో సిసి రోడ్ల ప్యాచ్ వర్క్ లు, నూతన డ్రైన్లను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండి పనులను పరిశీలించాలన్నారు. పనులను ప్రత్యక్ష్ణ పరిశీలన చేసిన అనంతరం బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని తెలిపారు. చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకు ముందే డ్యామేజి జరిగితే సంబందిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేసిన ఇంజినీరింగ్ అధికారులు భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. శారదా కాలనీలో పెండింగ్ లో ఉన్నరోడ్ నిర్మాణ పనులను గమనించి, సంబందిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే సంజీవయ్య నగర్ రైల్వే గేటు నుండి నెహ్రు నగర్ గేటు వరకు రోడ్, డ్రైన్ ఆక్రమణల వలన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, డిశంబర్ 2 నుండి ఆక్రమణల తొలగింపుకు యాక్షన్ ప్లాని సిద్దం చేయాలని, ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు.
అనంతరం చౌడవరంలోని సిఆర్ కాలనీని పరిశీలించి, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనిలో పారిశుద్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల గూర్చి స్థానికులను అడిగి తెలుసుకొని, కాలనీలో మౌలిక వసతుల ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, ఏసిపి వెంకటేశ్వర్లు, డిఈఈ కళ్యాణరావు, ఆర్.ఓ.లు రవి కిరణ్ రెడ్డి, సాదిక్ భాష, ఏఎంహెచ్ఓ రాంబాబు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …