గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కొరకు నగర పాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103, 104, 105 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత తమ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 20 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు.
అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని మాట్లాడుతూ నగర ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కొరకు నగర పాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103, 104, 105 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాల్ సెంటర్ ప్రతి రోజు ఉదయం 8 నుండి రాత్ర 8 గంటల వరకు పని చేస్తుందని, సమస్యలపై ఫిర్యాదులతో పాటుగా నగర పాలక సంస్థ అందించే సేవలు (ఆస్తి పన్ను మార్పు, ఆస్తి పన్ను విధింపు, నీటి కుళాయిల కనెక్షన్ లు, కుళాయిల రిపేర్లు, డ్రైన్ కనెక్షన్లు, రిపేర్లు, ట్రేడ్ లైసెన్సులు, జనన, మరణ ధ్రువ పత్రాల మార్గ దర్శకాలు, వివాహ పత్రాల నమోదు) కు సంబందించిన సందేహాల నివృత్తి కోసం కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యలను స్థానికంగానే పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 41 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 16, ఇంజినీరింగ్ విభాగం 16, రెవెన్యూ విభాగం 5, పరిపాలన విభాగంకి సంబందించి 4 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, మేనేజర్ బాలాజీ బాష, డిసిపిలు, ఏసిపిలు, ఈఈలు, ఆర్ఓలు, ఎస్ఎస్ లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …