Breaking News

ఆచంట వెంకటరత్నం నాయుడు  9వ వర్ధంతి

తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆచంట వెంకటరత్నం నాయుడు  9వ వర్ధంతి సందర్భంగా సోమ‌వారం ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-ఆచంట వెంకటరత్నం నాయుడు గారు విజయవాడకు సమీపంలోని ‘నున్న’ అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆచంట, చిన్నప్పటి నుంచి నాటకాలపై మక్కువ చూపించి, తెలుగు రంగస్థలంలో ఒక చిరస్మరణీయ నటుడు అని, ఆయన తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అని.. ఆయన పోషించిన పాత్రలలో దుర్యోధనుడి పాత్ర ఆయనకు ఎంతగానో ప్రసిద్ధి తెచ్చింది, ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆయనను అభినవ దుర్యోధనుడు అని పిలిచేవారు అని..ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హంస పురస్కారం, నందమూరి తారక రామారావు స్మారక పురస్కారం వంటి అనేక పురస్కారాలు లభించాయి అని.. ఆచంట వెంకటరత్నం నాయుడు తెలుగు రంగస్థలంకు అందించిన కృషి అనన్యమైనది,ఆచంట వెంకటరత్నం నాయుడు తెలుగు రంగస్థలం యొక్క ఒక అద్భుతమైన నటుడు, ఆయన తెలుగువారి   మనస్సుల్లో ఎల్లప్పుడూ జీవించి ఉంటారు అని బొండా ఉమ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఐక్య కాపు నాడు రాష్ట్ర అధ్యక్షులు బేతు రామమోహనరావు, గోళ్ళ నారాయణరావు, ప్రముఖ కళా కారులు ఆచంట బాలాజీ నాయుడు, రావి వెంకట్, అంబటి మధు్మోహన కృష్ణ, కంది గంగాధర్, బొజ్జ శంకర్, పెన్నేరు దామోదర్, మోహన్, చివుకుల హరగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *