Breaking News

డిశంబరు 31 నుండి సింగిల్ విండో విధానం ద్వారా భవననిర్మాణ అనుమతులు

-ఇకపై భవన నిర్మాణ అనుమతులకై పలు శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
-భ‌వ‌నాలు,లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
-15 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ నిర్మించే భ‌వ‌నాలకు ప్లాన్ అనుమతులు అవ‌స‌రం లేదు
-టిడిఆర్ అంశాలపై 15 రోజుల్లో పూర్తి స్థాయి సమీక్ష
-అమృత్ 2.0ను రెండేళ్ళలో పూర్తి చేయాలని సియం ఆదేశాలు
-మెప్మా సభ్యుల అభ్యున్నతికి పి-4 విధానంలో తగిన చర్యలు
-రాజధానిలో ఐకానిక్ భవన నిర్మాణాల పనులు త్వరలో మొదలవుతాయి
-రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు పి.నారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భ‌వ‌నాలు,లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్క‌ర‌ణ‌ల‌పై వేసిన క‌మిటీ రిపోర్ట్ కు సీఎం ఆమోద ముద్ర వేశారు.15 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ భ‌వ‌నాల నిర్మాణాల ప్లాన్ ల‌కు మున్సిప‌ల్ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేదు.రాష్ట్రంలో వచ్చేనెల 31 నుండి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేదుంకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి.నారాయణ వెల్లడించారు.ఈమేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్ర మున్సిపల్ శాఖపై సమీక్షించారని ఈసమావేశంలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన అంశాలపై సియం పలు కీలక సూచనలు చేశారని తెలిపారు.ముఖ్యంగా భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భవన నిర్మాణ అనుమతులు పరిశీలనకై 7 కమిటీలను ఏర్పాటు చేయగా వారు 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చి నివేదిక సమర్పించారని మంత్రి నారాయణ వివరించారు.భవన నిర్మాణ అనుమతులకై నిర్మాణదారులు వివిధ శాఖల అనుమతులకై రెవెన్యూ,రిజిష్ట్రేషన్ అండ్ స్టాంప్స్,అగ్నిమాపక శాఖలతోపాటు గనులు,రైల్వే,విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతులకై తిరిగడం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని అనుమతులు ఒకేచోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఇందుకు సంబంధించి ఆయా శాఖల సర్వర్లను మున్సిపల్ పరిపాలనశాఖ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేయనున్నట్టు తెలిపారు.ఈవిధానం వచ్చే నెల 31 నుండి అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వివరించారు.
లైసైన్డు సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆన్లైన్లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.ఈఅనుమతులు మంజూరుకు సంబంధించి ఎవరైనా లైసెన్సుడు సర్వేయర్లు అవకతలకు పాల్పడితే అలాంటి వారి లైసెన్సును రద్దు చేయడం తోపాటు వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.దీనిపై ఏర్పాటైన టాస్కుఫోర్సు కూడా ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో వివిధ లేఅవుట్లలో ప్రస్తుతం 12 అడుగుల వరకూ స్థలాన్నిరోడ్డుకు కేటాయించాల్సి ఉందని అయితే వివిధ రాష్ట్రాల్లో అది 9 అడుగులుగా ఉందని అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా అనుసరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు.అదే విధంగా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణలో నిర్మించే వాణిజ్య భవనాలు,నివాస భవనాలకు సంబంధించి సెల్లార్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.హై రైజ్ భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ ఏరియా ఎంత ఉండాలనే దానిపై కూడా స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.టిడిఆర్ బాండ్లకు సంబంధించి కూడా సియంతో జరిగిన సమావేశంలో చర్చకు రాడవడం జరిగిదని దానిపై పూర్తి వివరాలు సేకరించి రావాలని 15 రోజుల్లో మరలా సమీక్షిస్తానని సియం చెప్పారని అన్నారు.మెప్మాకు సంబంధించి ప్రస్తుతం సుమారు 28లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వారి అభ్యున్నతికి పి-4 విధానంలో రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.రాష్ట్రంలో అమృత్ 2.0 ను రెండేళ్ళలో పూర్తి చేయాలని సియం ఆదేశించారని ఆప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
అమరావతి రాజధానికి సంబంధించి మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి అని పార్లమెంటులో కేంద్రం గతంలోనే స్పష్టంగా చెప్పిందని కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని చెప్పారు.ఐదు ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ గతంలో రూపోందించిందని అయితే గత ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్ ను,వారి డిజైన్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. అందుకే మళ్లీ ఈభవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలవగా ఆ టెండర్లు మరలా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు.త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని,గత ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసిందని అన్నారు.అందుకే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి రూ.9 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని ఆ కారణంగానే ఇప్పుడు మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని దశలవారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *