విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది. విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, ఉపాధ్యక్షులు మల్నీలడు యల్లమందరావులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘ గౌరవాధ్యక్షులు పి. రామచంద్రయ్య, పుట్టపర్తిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ. కాటమయ్య, కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతుసంఘ కార్యదర్శి కె. జగన్నాథం, తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రైతుసంఘ ఉపాధ్యక్షులు ఎ. రామానాయుడు, ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో కౌలు రైతులసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జములయ్య, ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతుసంఘ ఉపాధ్యక్షులు వి. హనుమారెడ్డి, అనంతపురం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతుసంఘ కార్యదర్శి సి. మల్లిఖార్జున, పార్వతిపురంలో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘ కోశాధికారి ఉలవలపూడి రాములు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …