-రాజ్యంగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి : పత్తి శివరామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు పత్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న తొలిసారిగా ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్యాంగ దినోత్స వంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రజలందరికీ సంవిదాస్ దివాస్, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949సం నవంబరు 26వ తేదిన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందుకే నవంబరు 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగాను జరుపుకుంటున్నాము. సమానత్వం-స్వేచ్చ-సౌబ్రాతృత్వం-లౌకిక రాజ్యం లాంటి ప్రత్యేకతలతో మన రాజ్యాంగం విలసిల్లుతున్నది. లౌకిక రాజ్యం అంటే మతాతీత రాజ్యం కాదు. రాజ్యానికి మతం వుండదని అర్థం. నేటినుంచి భారత దేశపౌరులమైన మనం, మన పాలకులు రాజ్యాంగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు రాజ్యాంగ విలువులను ప్రచారం చేయడం ఒక విధిగా ఆచరించాలని, అప్పుడే సమాజంలో హింస, లైంగిక దాడులు, మత విద్వేషాలు పూర్తిగా తగ్గుతాయని మరియు మన పిల్లలు విజ్ఞానవంతులుగా తయారవుతారని విజ్ఞప్తి చేస్తూ… నా ప్రియమైన భారతీయులందరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్, బిజెపి ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి, శ్రీ రామనామ సంకీర్తన కార్యదర్శి ఓడిపిన శివ, పేరం బాల సత్యనారాయణ, మారదాన జేజి బాబు, చొక్కర దుర్గారావు, చొక్కర పాపారావు, మిర్చి రామారావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.