విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంగళవారం ఉదయం జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ ఘనంగా నిర్వహించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, కార్పొరేషన్ శాఖధిపతులు మరియు సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశిక ను చదివించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగం తెలుసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో భారత రాజ్యాంగం గురించి చర్చించడమే కాకుండా భావితరాలకు కూడా అవగాహన కల్పించి, భారత రాజ్యాంగ పరిజ్ఞానం పెంచాలని అన్నారు. ఈ వేడుకలలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, అకౌంట్స్ ఎగ్జామినర్ చక్రవర్తి, సూపరిండెంటింగ్ ఇంజనీర్ ( ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, జి సామ్రాజ్యం, మేనేజర్ ఎ యు బి శర్మ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రజియా షబ్బీనా మరియు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …