మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) గా జరుపుకుంటామని తెలిపారు. భారతదేశం ఒక సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డ్వామా పిడి శివ ప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, సి పి ఓ గణేష్ కృష్ణ, కలెక్టరేట్ ఏవో, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.