మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని పిల్లల సంరక్షణ సంస్థల్లో (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) రక్షణ పొందుతున్న పిల్లలందరినీ జువైనల్ జస్టిస్ చట్టం పరిధిలోకి తప్పనిసరిగా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో అనాధ పిల్లల సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనాధ పిల్లలను, పిల్లల సంక్షేమ కమిటీ (సి డబ్ల్యూ సి) ద్వారా లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ సర్టిఫికెట్ మంజూరు చేసి కారా వెబ్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, తద్వారా పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే వారి సౌకర్యార్థం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను గుర్తించి వారికి ఆధార కార్డులు, ఆర్ఫన్(అనాధ) సర్టిఫికెట్ల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పీడీ ఎస్ సువర్ణ, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ సత్యవతి, డీసీపీవో మోనిష, ఇతర అధికారులు మధుబాబు, ప్రశాంతి పాల్గొన్నారు.
Tags machilipatna
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …