Breaking News

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి పంచాయతీరాజ్, డ్వామా, గ్రామ వార్డు సచివాలయా తదితర శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని, ఆయా పనులు పూర్తయిన వెంటనే అందుకు సంబంధించిన బిల్లులను సకాలంలో అప్లోడ్ చేసి కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిఎస్టి, జిఎస్టి యేతర రిజిస్టర్ లను తప్పనిసరిగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా జిల్లాలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి మందగించిందని, రేపటి నుంచి వ్యక్తుల మరణాలు, వలసలకు సంబంధించిన ఆప్షన్లను ఎంచుకునేందుకు యాప్ లో పొందుపరుస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్.ఇ. రమణారావు, డ్వామా పిడి శివప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డిఎల్డిఓలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *