Breaking News

కార్యకర్తకిచ్చిన అరుదైన గౌరవం…


-ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తకు అరుదైన గౌరవానిచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. విజయవాడలోని శిల్పారామం ఆర్స్ అండ్ కల్చర్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం చేరెడ్డి మంజులారెడ్డి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జూలకంటి మాట్లాడుతూ టిడిపిలో నాయకులను కార్యకర్తలను పార్టీ కోసం కష్టపడిన వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అనేదానికి ఈ ఎన్నిక ఒక నిదర్శనమన్నారు. ఓరుగల్లు రాణి రుద్రమదేవి పుట్టినిల్లుగా, పల్నాటి పౌరుషం మెట్టినిల్లుగా నింపుకున్న మంజులా రెడ్డి తెగింపు మాటలో చెప్పలేనిదన్నారు. ఒకవైపు శిరస్సు నుండి రక్తం కారుతున్న పార్టీ గెలుపు కోసం చంద్రబాబుని ముఖ్యమంత్రి పేఠంపై కూర్చోవాలని మాచర్లలో టిడిపి జెండా ఎగురాలని మొక్కవోని దీక్షతో ముందుకు సాగారన్నారు. ఇటువంటి ధైర్యవంతురాలు నిబద్ధత కలిగిన మంజులా రెడ్డి మరింత అభివృద్ధి పథంలో ఈ సంస్థను ముందుకు తీసుకువెళుతుందని పరిపూర్ణ విశ్వాసం తోటి పార్టీ ఎంపిక చేసిందన్నారు నిరంతరం పట్టుదలతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారని కార్పొరేషన్ కు ఆమె మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది పల్నాడులో మహిళకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామన్నారు.

ఆ ధైర్యమే మాకు ధైర్యాన్నిచ్చింది…శిల్పారామం ఆర్స్ అండ్ కల్చర్ సొసైటీ చైర్మన్ మంజులా రెడ్డి
పల్నాడులో గత 16 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక పాలన అంతమొదించడానికి నేనున్నానంటూ ముందుకు వచ్చిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇచ్చిన ధైర్యమే మాకు మరింత ధైర్యాన్నిచ్చిందని మంజుల రెడ్డి తెలిపారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నారా భువనేశ్వరికి ,ఎమ్మెల్యే జూలకటి బ్రహ్మానంద రెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో స్వామి నాయుడు సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *