విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి నుండి దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆయుష్ డిపార్ట్ మెంట్ కమిషనర్ డా. మంజుల డి హోస్ మణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమాలు ఈ నెల 26 నుండి డిసెంబర్ 25 వరకు జరుగుతాయని వివరించారు. నెల రోజుల ఈ ప్రచారం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మందికి పైగా ప్రకృతి వైద్యంపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ప్రచారంలో ఆయుర్వేద కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యాధికారులు, ఆయుర్వేద అభ్యాసకులు ప్రకృతి వైద్యంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తారని వివరించారు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం పై దృష్టి సారిస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో వర్క్ షాపులు, సెమినార్ లు నిర్వహిస్తామని, ప్రజలను చైతన్యవంతం చేస్తామని పేర్కొన్నారు. భారతీయ సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రోత్సహించాలన్న నిబద్ధతతో ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. ప్రకృతిని అర్థం చేసుకుని, దాని ఆధారంగా జీవనశైలిని మార్చుకుంటే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని అంతేకాకుండ వారి జీవనం సాఫీగా సాగుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆయుష్ డిపార్ట్ మెంట్ కమిషనర్ మంజుల డి హోస్ మణి పిలుపునిచ్చారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …