Breaking News

మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులను పరిశీలించిన  కలెక్టరు జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాలు ఎక్కువుగా కురుస్తున్నందున విజయవాడ రూరల్ మండలానికి సంబందించి మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బ్యాక్సులను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు.
జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు ఎక్కువుగా కురవడంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, యంపీటీసీ ఎన్నికలకు సంబందించి మాంటీసోరి మహిళా కళాశాల స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులు వద్దకు నీరు చేరడంతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి హోదాలో జిల్లా కలెక్టరు జె. నివాస్ తో పాటు రిటర్నింగ్ అధికారి, పోటీచేసిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో రెండు స్ట్రాంగ్ రూమ్ లను శుక్రవారం తెరచి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్ట్రాంగ్ రూమ్ లో గల బ్యాలెట్ బ్యాక్సుల పరిశీలించి, ఎటువంటి చెమ్మ బ్యాలెట్ బ్యాక్సుల వద్దకు చెరకుండా టార్ఫాలియన్ వేయాలని, అదేవిధంగా భవనం పైన కూడా వర్షపునీరు క్రిందికి దిగకుండా వాటర్ ప్రూఫ్ టార్పాలియన్ వేయాలని అధికారులకు ఆదేశించారు.
తదుపరి అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లను తాళాలు వేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరు వెంట జాయింట్ కలెక్టరు (అభివృద్ది) శివ శంకర్, జిల్లా పరిషత్ సీఇవో సూర్య ప్రకాశరావు, రిటర్నింగ్ అధికారి, తాహశీల్థార్ శ్రీనివాస నాయక్, పోటీలో ఉన్న రాజకీయ పార్టీ అభ్యర్థులు, తదితరులు ఉన్నారు.

Check Also

గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *