విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పటమటలంక వల్లూరి సరోజని మున్సిపాల్ కార్పొరేషన్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులను శనివారం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డాక్టర్ జె.అరుణ, ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ లోని సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని, అన్‌లైన్ లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ వీడియో & వాయిస్ క్లారిటిగా వస్తున్నది లేనిది స్వయంగా పరిశీలించారు. టీచర్స్ చెప్పిన సబ్జెక్టులు అర్థమవుతున్నది లేనిది అడిగి తెలుసుకొన్నారు. , అన్‌లైన్ క్లాసులకు హాజరుకానీ పిల్లల తల్లితండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు క్రమ శిక్షణ కలిగిన విద్యను అవలంబించాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. స్కూల్ సిబ్బంది తో మాట్లాడి డైలీ అన్‌లైన్ క్లాసులకు హాజరుకానీ పిల్లల తల్లితండ్రులకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆన్ లైన్ క్లాసులకు హాజరు అగునట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ తరగతుల నిర్వహణలో ఏమైనా ఇబ్బందు ఎదురైన వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …